
బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో మంగళవారం బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నా దివ్యాంగులందరికీ ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించి అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసేన నాయకులు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జనసైనికులు ఇమ్మడిశెట్టి మురళీ కృష్ణ, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.