అరకు, (జనస్వరం) : రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని అరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గురువారం జనసైనికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబా, దురియా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సచివాలయ ఉద్యోగస్తులకు రెండేళ్ల పూర్తయిన అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘం రెగ్యులరైజ్ చేస్తానని ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హక్కుల సాధన కోసం ప్రశ్నిస్తున్న ఉద్యోగులను భయభ్రాంతులు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి సచివాలయ ఉద్యోగులకు పేస్కెల్ పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సన్యాసిరావు, గేమ్మిలి, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com