Logo
Date of Publish : 23 December 2021, 4:30 pm
Editor : Sake Naresh

దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలి? జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా, బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఉన్న దివ్యాంగుల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, పెద్ద వారందరూ కూడా మానవ హక్కుల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అలాగే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అందరికి పది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది. పైన ఉన్న ఈ రెండు అంశాల మీద వెంటనే స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల నాయకులు కంది వెంకటరెడ్డి, దేవి రెడ్డి శ్రీనివాసరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com