
అరకు, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గం అరకువెలి మండలం ఇరగాయి పంచాయితీ మ గాతపాడు గ్రామంలో అరకు జనసేనపార్టీ బృందం పర్యటించడం జరిగింది. అలాగే గ్రామస్తులతో సమావేశమై గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామమంలో ఎప్పుడో తవ్వేసిన మట్టి రోడ్డు ఏదైనా పెద్ద కష్టం వస్తే గ్రామం నుండి ఎటువైపు తీసుకు వెల్లలన్న చాలా కష్టం రోడ్డు సదుపాయం గతాపాడు గ్రామంలో రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, స్కూల్ బిల్డింగ్ లేదు. మంచి నీటి సదుపాయం లేదు. గ్రామంలో వెంటనే మంచి నీటి స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ సదుపాయం కల్పించాలని గ్రామస్తులతో కలిసి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొని అధికారులపై, ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామస్తులతో పోరాటం ఉదృతం చేస్తామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.