జగ్గయ్యపేట, (జనస్వరం) : కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాల ముసుగులో జరుగుతున్న పేకాట శిబిరాలను అరికట్టాలని జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ముత్యాల వెంకట శ్రీనివాసరావు మరియు కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి పెద్డ పండగ సంక్రాంతి సంప్రదాయ ఆట కోడి పందాలను వ్యతిరేకించడం లేదని కానీ ఈ కోడిపందాల ముసుగులో అధికార పార్టీ వారి అండతో పేకాట శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని మరి వీటి వలన అనేక మంది అప్పుల పాలు అవటమే కాకుండా ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని, తక్షణమే ఈ పేకాట శిబిరాల్ని అరికట్టవలసిందిగా జగ్గయ్యపేట పట్టణ మరియు రురల్ పోలీస్ వారిని జనసేన పార్టీ తరువున కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్, నాగేశ్వరరావు, రాం, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com