Search
Close this search box.
Search
Close this search box.

గ్రూప్‌1లో అక్రమాలపై విచారణ చేయాలి? జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌

– ప్రతిభావంతులకు అన్యాయం
– సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోతే ఉద్యోగం రాదా?
– మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమాధానం చెప్పాలి
– జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌
          విజయవాడ, (జనస్వరం) : ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలలో డిజిటల్‌ వాల్యుయేషన్‌ కరెక్టా? లేక మాన్యువల్‌ వాల్యూమ్‌ కరెక్టా? మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమాధానం చెప్పాలి? ఆ తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ గురువారం డిమాండ్‌ చేశారు. గ్రూప్‌ 1 కోసం సిద్ధమైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని కోరారు. డిజిటల్‌ వాల్యుయేషన్‌ లో అర్హత సాధించిన 202 మంది అభ్యర్థుల భవిష్యత్తును- అర్హత లేని అధ్యాపకులతో మాన్యువల్‌ వాల్యుయేషన్‌ చేయించడం ద్వారా వారి తలరాతలు మారిపోయాయన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతి వలన మాన్యువల్‌ వాల్యుయేషన్‌ లో భారీ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు అనుమానిస్తున్నారన్నారు. అందుకే డిజిటల్‌ వాల్యుయేషన్‌ లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 202 మంది అభ్యర్థులు మ్యాన్యువల్‌ వాల్యుయేషన్‌ లో ఈ 202 మంది అభ్యర్థులు మైయిన్స్‌ పాస్‌ అవ్వక ఇంటర్వ్యూకు అర్హత సాధించలేకపోయారా లేకపోతే పెద్దలకు చేతులు తడపకపోవడం వల్ల వారి చేతి రాతలు తారుమారై తలరాతలు మారిపోయాయా? అభ్యర్థుల డిమాండ్‌ ప్రకారం ఏపీపీఎస్సీ వారు యు.పి.ఎస్‌.సి. వారితో మరొకసారి వాల్యుయేషన్‌ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అభ్యర్థుల నిజమైన ప్రతిభ బయటికి రావాలంటే కచ్చితంగా మూడోసారి వాల్యుయేషన్‌ యు.పి.ఎస్‌.సి. వారితో చేయించాలన్నారు. ఏపీ హైకోర్టులో డిజిటల్‌ వాల్యుయేషన్‌ ప్రపంచంలోనే ఉత్తమమైందని, ఉత్తమ ఫలితాలు ప్రకటించామని ఎటువంటి పొరపాట్లు జరగలేదని వాదనలు వినిపించిన ప్రభుత్వం – నేడు మ్యాన్యువల్‌ వాల్యుయేషన్‌ లో ఇంత భారీగా అవకతవకలు జరిగితే ఇంటర్వ్యూలు ఏ విధంగా నిర్వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు. గ్రూప్‌ 1 జవాబు పత్రాలను వాల్యుయేషన్‌ చేసే అర్హత డిగ్రీ అధ్యాపకులకు ఉందా? మాన్యువల్‌ వాల్యుయేషన్‌ చేసే డిగ్రీ అధ్యాపకులు ఎక్కడ ఏ పేపర్‌ వాల్యుయేషన్‌ చేస్తున్నామో వాట్సాప్‌ లో అందరికీ సమాచారం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇదేనా గ్రూప్‌ వన్‌ అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే విధానం? ఖచ్చితంగా ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని తెలిపారు. ఓసీలకు, బీసీలకు మరియు తెలుగుమీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. గతంలో మెయిన్స్‌ ఫలితాలు కు ఇంటర్వ్యూకు మధ్య 2 నెలల సమయం తీసుకున్నారు కానీ ఇప్పుడు కేవలం 20 రోజుల్లోనే ఎందుకో గౌతమ్‌ సవాంగ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 202 మంది అభ్యర్థులకు ఉత్తమ ఉద్యోగం పోయి నిరుద్యోగులుగా మిగిలి పోవాల్సిందేనా? ఎవరో చేసిన తప్పుకు వీరు శిక్ష అనుభవించాలన్నారు. నాలుగు సంవత్సరాల నిరీక్షణ వీరికి నిరాశను మిగులుస్తుందా? సరస్వతీ కటాక్షంతో డిజిటల్‌ వాల్యుయేషన్‌ లో అర్హత సాధించినా లక్ష్మీ కటాక్షం లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో అర్హత సాధించిన ఉద్యోగాలు పొందలేరని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్‌ వన్‌ లాంటి పెద్ద ఉద్యోగాల ఎంపికలో అవినీతిని చొప్పించి రాబోయే 20, 30 సంవత్సరాలకు అవినీతి బీజం వేసింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అని అన్నారు. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ గా ఉన్న పి.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు గారు సక్రమంగా పని చేశారని, అభ్యర్థులు విశ్వసిస్తున్నారు కానీ గౌతమ్‌ చైర్మన్‌గా ఉన్న ఈ సమయంలోనే అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్నారన్నారు. గౌతమ్‌ సవాంగ్‌కి బాధ్యతలు ఇచ్చిన తర్వాతే అన్ని తారుమారయ్యాయని తెలిపారు. సవాంగ్‌ మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించాక ఇంటర్వ్యూ లకు 2 నెలల సమయం ఎందుకు తీసుకోలేదని, కేవలం 20 రోజుల్లోనే ఎందుకు ఇంత తొందర పడుతున్నారన్నారు. ఇప్పుడు హైకోర్టు వేసవి సెలవుల్లో ఉన్నందున ఎవరు కేసు వేయరనే ఉద్దేశం ఉందా? మీరు నిజమైన అర్హత ప్రతిభ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలంటే మూడవసారి యూపీఎస్సీ వారిద్వారా వాల్యుయేషన్‌ చేయించిన తదుపరి మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way