
పెందుర్తి, (జనస్వరం) : ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డిని వెంటనే రీకాల్ చేయాలని జనసేనపార్టీ మరియు విద్యార్థి, యువజన, ప్రజా అభ్యుదయ, దళిత, బహుజన సంఘాలు శాంతియుతంగా నిర్వహిస్తున్న ఛలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొనకోకుండా ఉండుట కొరకు సి ఆర్ పి సి సెక్షన్ 151 క్రింద జనసేన పార్టీ 88 వార్డ్ నాయకులు జనార్ధన శ్రీకాంత్ వబ్బిన ను ముందస్తు అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాలు అన్నీ కూడా చరిత్రలో కుప్పకూలిపోయాయి. వచ్చే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అక్రమ అరెస్టులను జనసైనికులు మరియు ప్రజలు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఛలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని కోరడం జరిగింది.