భైంసా ( జనస్వరం ) : పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందర ఆశ వర్కర్ల సమ్మె 4 వ రోజు మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మద్దతు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో సీజనల్ వ్యాదులకు, దీర్ఘ కాలిక వ్యాదులకు మందులు టీకాలు ట్యాబ్లెట్లు ఇంటింటా పంపిణీ చేస్తూన్నారని అన్నారు. కనీసం నెల వారి ఫిక్సిడ్ వేతనం లేకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా 18 వేయిల రూపాయల ఫిక్సిడ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. PF, ESI సౌకర్యాలు, ప్రమాద బీమా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు అన్ని సంక్షేమ పథకాల్లో అర్హులుగా గుర్తించాలి. లేని యెడల భవిష్యత్ లో జరగబోయే పోరాటానికి జన సేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం నాయకులు మరకంటి విజయ, లక్ష్మి, శాంత వందన, పద్మ, మంజుల, ఉజ్వల, మౌనిక, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com