అరకు, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గంలో డుంబ్రిగుడా మండలంలో గల పోతాంగి పంచాయితీ లివిటి ఫుట్ గ్రామంలో జనసేనపార్టీ నాయకులు మాదాల శ్రీరాములు పర్యటించడం జరిగింది. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ నాడు నేడు కింద ఇచ్చిన బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఉన్న చోట కాకుండా ఇలాంటి గ్రామాల్లో నాడు నేడు బిల్డింగ్ ఇచ్చి ఉంటే ప్రయోజనం ఉండేది అని అన్నారు. డుంబ్రిగుడా మండలా కేంద్రానికి కొద్ది దూరంలో గ్రామం ఉన్న ఆ గ్రామంలో పాఠశాల భవనం లేక పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. బ్లాక్ బోర్డు లేక రేకులో ABCD లు అ ఆ లు నేర్పిస్తున్నారు. మట్టితో గోడ నిర్మించి రేకుల షెడ్డు లో చదువు చెప్తున్నారు. ఏ క్షణంలో షెడ్డు కూలిపోతుందో తెలియదు. భయం భయంగా పిల్లల తల్లితండ్రులు పిల్లలకు బడికి పంపుతున్నారని అన్నారు. స్కూల్, మరుగుదొడ్లు, మంచి నీటి సదుపాయాలు లేవని అన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ITDA PO గారు స్పందించి వెంటనె లివిటిఫుట్ గ్రామంలో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని వారు విద్య శాఖ అధికారులమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు డుంబ్రిగుడా ZPTC అభ్యర్థి కొనెడి చినబాబు, అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కొనెడి లక్ష్మణ్ రావు, డుంబ్రిగుడా మండల నాయకులు బంగురు రామదాసు, అల్లంగి రామకృష్ణ, సోబోయి రాజు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com