- రూ.93 లక్షల ఆలయ అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- సేకరిస్తున్న విరాళాలకి సక్రమమైన రసీదులు ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి
- పాలకమండలి అభివృద్ధి వైపా లేక అవినీతి వేపో తేల్చుకోవాలి
- లేని వారసత్వాన్ని ఈఓ ఏ విధంగా సృష్టిస్తారు సమాధానం చెప్పాలి
- ముడుపులు ఇస్తే అక్రమం సక్రమం అయిపోతాయా..?
విజయవాడ, (జనస్వరం) : పాతశివాలయంలో అమ్మవారి ఆలయ ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ అన్నారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం పాత శివాలయంలో ఉన్న అమ్మవారి ఆలయా ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలని, వారసత్వం లేనటువంటి వ్యక్తులను అక్రమ పద్ధతిలో ఆర్ జె సి సురేష్ బాబుకు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు రూ.పది లక్షల ముడుపులు అందజేసి ఈ ముఖ్య అర్చక పదవిని అక్రమ మార్గంలో ఆలయ ఈవో భర్తీ చేయాలని చూస్తున్నారన్నారు. నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఆలయ ఈవో హేమలత దేవికి లేకపోయినా గోడ మీద రెండు కాగితాలు అంటించి నోటిఫికేషన్ గా మాట్లాడుతున్నారని, నోటిఫికేషన్ జారీ చేసే అధికారం అసిస్టెంట్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్ కు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కి ఉంటుంది కానీ ఈ ఆలయ ఈఓకు ఏమాత్రం ఉండదని, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు జయంతు సత్యనారాయణకి వివాహం కాలేదని అందువల్ల వారికి వారసులు ఎవరూ లేరని, కానీ ఈఓ లేని వారసత్వాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తూన్నారని, అందుకోసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి, ఆర్ జే సీ సురేషబాబుకు రూ.10 లక్షలు ముడుపులు చెల్లించి అక్రమ పద్దతిలో నియామకం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ముఖ్య అర్చక పదవి నియామకంలో ఆలయ ఈఓకి ఆంత ఉత్సాహం ఎందుకో సమాధానం చెప్పాలని, సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేసి ప్రధాన అర్చక పదవి భర్తీ చేయకపోతే సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. న్యాయం జరగని పక్షంలో కోర్టును కూడా ఆశ్రయిస్తామని, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం 93 లక్షల రూపాయల నిధుల వినియోగంపై శ్వేత పత్రం ఆలయ ఈఓ విడుదల చేయాలని కోరారు. ఈ రూ.93 లక్షల నిధులతో కేవలం రంగులు వేయడానికి సరిపెట్టారేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు, భక్తులు ఇచ్చే విరాళాలకు సక్రమంగా రసీదులు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయని, దీనిపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాలని, పాలకమండలి చైర్మన్, పాలకమండలి గుంపులుగుంపులుగా మాపై ప్రెస్ మీట్ లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ఆలయ అభివృద్ధి పైన అదే విధంగా ముఖ్య అర్చక పదవి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయించి భర్తీ చేయడం పైన దృష్టి సారించాలన్నారు. పాలకమండలి అభివృద్ధి వైపు అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాలుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కనకదుర్గమ్మ ఆలయంలో అందినకాడికి దోచుకున్నారని, ఇప్పుడు పాత శివాలయం లోని అమ్మవారి ఆలయం ముఖ్య అర్చక పదవికి ముడుపులు తీసుకోవడం చాలా దుర్మార్గమని, అవినీతికి కొత్త కొత్త మార్గాలు నిత్యం వెతుక్కుంటున్నారని, తన బినామీ ఈవో సురేష్ బాబు కి పదోన్నతి కల్పించి ఆర్ జేసీ చేసి ఈ నాలుగు జిల్లాల్లో ముడుపులు వారి ద్వారా అందుకుంటున్నారని, ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్న దేవాదాయశాఖ మంత్రి పై అమ్మవారు, భక్తులు తగిన సమయంలో తప్పక శిక్షిస్తారని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com