మడకశిర ( జనస్వరం ) : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు సదరం సర్టిఫికెట్ కోసం వికలాంగులు అనేక ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చి అనేక తీవ్రమైన ఇబ్బందుల పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య వైఖరితో సతమతమవుతున్నారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, కంబదూరు, బత్తలపల్లి, తాడిపత్రి అనేక ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల తమ ఆందోళనలో తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మండల జనసేన అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ తరుపున ఈ వికలాంగులకు మద్దతు తెలుపుతూ సమస్యలు పరిష్కరించే విధంగా ఏ పార్టీ వ్యక్తులైనా రాజకీయాలు చెయ్యాలి. కానీ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయకూడదు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి అవకాశం చేయాలని లేనిపక్షంలో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. చిన్నారి మృతి అకాల మరణం చెందిన ఆ విషయాన్ని ఎంతో చింతిస్తున్నామన్నారు. అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి వికలాంగులకు సర్టిఫికేట్లు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించే విధంగా జనసేన పార్టీ కార్యాచరణ చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com