అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గ పరిధిలోని చిత్రావతి నదిలో ఇసుక తవ్వకాల అనుమతులు ఆపాలని చిత్రావతి పరివాహన ప్రాంత పరిరక్షణ సమితి నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు చింతకాయలమంద, మల్లాగుండ్ల గ్రామాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మీ సెల్వరాజన్‌ను కోరారు. సోమవారం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… చిత్రావతి నదిలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని అన్నారు. దీని ద్వారా భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ తవ్వకాలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కలెక్టర్ స్పందించి.. పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు చిత్రావతి నది ద్వారా అందే నీటితోనే సామాన్య ప్రజలు, రైతులు జీవన విధానాన్ని సాగిస్తున్నారు. కర్నాటకలో పెద్ద భారీగా వర్షాలు వస్తే తప్ప ఈ నదిలోకి నీరు వచ్చే అవకాశం లేదని, అలాంటి నదిని స్థానిక నాయకులు ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో నదిని అక్రమ ఇసుకలతో లూటీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలం అంటుకొని పోయి నీరు నిల్వ ఉండటం లేదు. అలాగే నీరు సాఫీగా వెళ్ళే పరిస్థితి లేదన్నారు. కనుక ఈ ఇసుక త్రవ్వకాల నుండి చిత్రావతి నది పరివాహక ప్రాంతానికి విముక్తి కలిగించాలని కలెక్టర్ గారిని కోరారు. కార్యక్రమంలో పసుపులేటి పద్మావతి, సాకే మురళీకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.