Logo
Date of Publish : 24 August 2021, 4:46 pm
Editor : Sake Naresh

పింఛన్లలో కోత వేసి చెత్త పన్ను వసూలు చేయడం దారుణం : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్

          ఒంగోలు, ( జనస్వరం) :  రాష్ట్ర ప్రభుత్వ అడ్డగోలు చెత్త పన్ను దోపిడీపై ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాన్ని గుర్తుచేశారు. 2021 జులై 8 వైఎస్ఆర్ జయంతి నుండి సామాజిక పింఛన్లు రూ.2250లు నుండి రూ.2500లు ఇస్తామన్న సంగతి ఇప్పుడేమైందని నిలదీశారు. ఆర్ధికంగా దివాళా తీసిన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేక చెత్త పై కూడా JST (జగన్ శానిటరీ ట్యాక్స్) పన్ను విధిస్తూ దేశంలోనే అభాసుపాలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని ఎద్దేవా చేసారు. ఇలాంటి అడ్డగోలు దోపిడీలతో పరిపాలన సాగిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారే అని, ఇలాంటి అడ్డగోలు విధానాలు లేకుండా ప్రజారంజక పాలన అందించే సత్తా ఉన్న నిజాయితీ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అని షేక్ రియాజ్ గారు  పునరుద్ఘటించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com