Search
Close this search box.
Search
Close this search box.

షేక్ రాజా ఆసుపత్రిని ( చెరువుల ఆసుపత్రి) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలి

షేక్ రాజా

       విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారు 50వ డివిజన్ అధ్యక్షులు సోమి. రెడ్డిపల్లి. గంగాధర్ & కమిటీసభ్యులు, పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి షేక్ రాజా ఆసుపత్రిని (చెరువుల హాస్పిటల్ ) పరిశీలించిటం జరిగింది. ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు మాట్లాడుతూ షేక్ రాజా హాస్పిటల్ నీ మినీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ చెయ్యాలని, అనేక సార్లు మేము డిమాండ్ చేసాంమని, ప్రతి నిత్యం ఇక్కడికి అనేక మంది ఇక్కడ వైద్యం చేసుకోవటానికి వస్తారని, వారికి సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ఈ ఆస్పత్రిలో ent విభాగం గాని, డెర్మటాలజీ విభాగం గాని,కంటి పరీక్షలు విభాగం గాని లేకపోవడం, ఇక్కడ చేసే రక్త పరీక్షలు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని, xrey లేదని ecg లేదని, లివర్ ఫంక్షన్ ఏవిధంగా పనిచేస్తుందో తెలుసుకొనే సౌకర్యం లేదని, ఈ సౌకర్యాలు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హాస్పిటలో శుభ్రత లేదని, వర్షం వస్తే నీరు లోపలకి వచ్చేస్తుందని, కనీసం బెడ్ల మీద దుప్పట్లో కూడా లేవని వెల్లంపల్లి శ్రీని వాస్ sk.రాజా హాస్పిటల్ నీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ చెయ్యమని అనేక సార్లు మేము డిమాండ్ చేస్తే చేతులెత్తేసారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను కచ్చితంగా గెలుస్తా షేక్ రాజా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి తీరుతాం. లేదా సామాన్య వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని, గుళ్ళునుదోచుకోవడం మరియు అక్రమ నిర్మాణాలు మీద డబ్బులు దండు కోవడం లో శ్రద్ధ హాస్పిటల్ అభివృద్ధి లో లేదని,వాలంటీర్స్ వ్యవస్థ లో కచ్చితంగా లోపాలు ఉన్నాయని,నవరత్నాలు అమలు చేయ్యడం కాదు నవ రత్నాలు రద్దు చెయ్యడానికి వారు ఉన్నారని భవానిపురం లో నాగేంద్ర అనే వాలంటీర్ ను నాయుకుడు కొడితే స్థానిక ఎమ్మెల్యే కనీసం స్పందించలేదని అన్నారు. 50వ డివిజన్ అధ్యక్షుడు రెడ్డిపల్లి గంగాధర్ మాట్లాడుతూ ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతన మహేష్ గారి ఆధ్వర్యంలో కేబీఎన్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి షేక్ రాజా హాస్పిటల్ ను విజిట్ చేయడం జరిగిందని ముఖ్యంగా హాస్పిటల్ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగిందని ఇక్కడ కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఎవరికైనా గుండె నొప్పి వస్తే ఈ హాస్పిటల్ నందు సరైన ఎక్విప్మెంట్ లేక ఇక్కడ నుండి జి జి హెచ్ కి వెళ్లాల్సి వస్తుందని స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉందా దాన్ని కబ్జా చేద్దామని చూడడమే తప్ప ఈ హాస్పిటల్ లో సరైన వసతి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవడంలేదని అదేవిధంగా మా నాయకులు పోతిన మహేష్ మీద ప్రతి ఒక్క పకోడీ గాడు కూడా ఇష్టనానుసారం అవాకులు చవాకులు పేలితే దానికి తగిన రీతిలో మీకు బుద్ది చెప్తామని మీలాంటి పకోడీ గాళ్లకు మా మహేష్ గారిని విమర్శించే స్థాయి కాదని మీరు వెల్లంపల్లి గారి ఆఫీస్ నందు టీలు సమోసాలు అందించుకోవడానికి పనికొస్తారు తప్ప దేనికి పనికిరారు అన్నారు . ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి గంగాధర్, రెడ్డిపల్లి అనిత, మొబీనా, పిళ్ళ రవి, రామ్ శెట్టి మురళి, సాబికర్ నరేష్, వాడపల్లి సురేష్ , చొక్కర నగేష్ ,చిట్టి రమణ, మొక్క రామారావు, మల్లెపు విజయలక్ష్మి,గన్ను శంకర్, శ్యామ్, వడ్డాది రాజేష్, పల్లంటి ఆది, పులిచెర్రి రమేష్ , రాసిన జగదీష్ చలమలశెట్టి , శిరీష, సుకాసి భాను ప్రకాష్ పొలిశెట్టి శివ , లండ ప్రశాంత్, శ్రీను పండు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way