దర్శి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా 30 కోట్ల రూపాయలను సహాయం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు టీమ్ పిడికిలి వారు రూపొందించిన పోస్టర్ ను దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు షేక్ ఇర్షాద్ ఆవిష్కరించి దర్శి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇర్షాద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీమ్ పిడికిలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజంగా ఆ కౌలు రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది అని ఇలాంటి నాయకుడికి ప్రజలందరూ అండగా ఉండాలని ఇర్షాద్ కోరారు. ఈ కార్యక్రమంలో పోతంశెట్టి హరికృష్ణ, పుప్పాల వసంత్ పాల్గొన్నారు.