కోవూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చి రెడ్డి పాలెం మండలం దామరమడుగు గుంటకట్ట ప్రాంతం మరియు కొత్త కాలువ గిరిజన కాలనీలో నివాసముంటున్న వరద బాధితులను నెల్లూరు జిల్లా కార్యదర్శి మరియు మైనార్టీ విభాగం జిల్లా నాయకులు షానవాజ్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు వచ్చిన వరద కారణంగా ఆ ప్రాంతమంతా జలదిగ్బంధంలో బాధితులు సర్వం కోల్పోయి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కనీస తాత్కాలిక వసతి కల్పించి వారికి ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టి ఇవ్వాలని, ఇంటిలో కనీసం సామాన్లు ఇచ్చి ప్రభుత్వం వారికి భరోసా కల్పించాలని, అలాగే గుంటకట్ట ప్రాంతంలో నివాసం ఉన్న వారికి కనీసం వాలంటరీ వ్యవస్థ కూడా అందుబాటులో లేదని, వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వడం లేదని చాలామంది వృద్ధులు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే కొత్త కాలువ గిరిజన కాలనీలో ఉండే వారికి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గిరిజనులు అమాయకులు వీరు ఏమీ అడగలేరు అని వారికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి వారిని మరింత క్షోభకు గురి చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు అని జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న జనసేన పార్టీ ముందు ఉంటుందని, అలాగే జనసేన పార్టీ వారికి నేను అని భరోసాగా నిలుస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్, జన సైనికుడు జాషువా, స్థానిక జనసేన పార్టీ నాయకులు ఇబ్రహీం, అల్తాఫ్ హుస్సేన్ సంధాని భాష మరియు స్థానికులు పాల్గొనడం జరిగింది.