Search
Close this search box.
Search
Close this search box.

చూసి ఓర్వలేక ఫ్లెక్సీలు చింపడం సిగ్గుచేటు : జనసేన నాయకులు తోట ఓబులేష్

జనసేన

           అనంతపురం (జనస్వరం) : సింగనమల నియోజకవర్గం కేంద్రంలో గల మండల కన్వీనర్ అయినటువంటి తోట ఓబులేష్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు అల్లరిమూకలు చింపి వేయడం జరిగింది. ఈ విషయమై సింగనమల పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్న పోలీస్ అధికారికి రాతపూర్వకమైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ నాయకులు సాకే మురళీకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున ఈ ఘటనకు కారణమైనబాధ్యులను వెంటనే శిక్షించాలని అలాగే అధికారం శాశ్వతం కాదని తెలియజేయడం జరిగింది. ఈ విషయమై పోలీసు వారు చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో మోహన్ మోహన్, కిరణ్, పెద్దిరాజు, సంజీవ ప్రసాద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way