Logo
Date of Publish : 14 October 2023, 10:37 pm
Editor : Sake Naresh

జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటు

      అరకు ( జనస్వరం ) :  జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే సైకో జగన్ రెడ్డికి చలి జ్వరం వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి అరాచకాలు, విధ్వంసాలు, అక్రమాలకు పాల్పడుతూ పాలన చేస్తున్న జగన్ రెడ్డి సీఎం అని చెప్పుకునేందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని అపహాస్యం చేశారు. ప్రభుత్వం డబ్బుతో సభలు పెట్టి చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం చెప్పుకోవలసిన జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా వివాహాలు చేసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సైకో జగన్ రెడ్డికి హితవుపలికారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని, మహిళలపై రోజురోజుకు అగత్యాలు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా జగన్ రెడ్డితోపాటు అతని మంత్రివర్గ సభ్యులు కూడా మాట్లాడుతున్నారన్నారు. జగన్ రెడ్డికి కూడా తల్లి, చెల్లి, భార్య ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రోడ్లమీద నడవకుండా, రోడ్లమీద తిరగకుండా గాలిలో తిరిగే గాలి సీఎం జగన్ గాలి మాటలతో కాలం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నియంతలా వ్యవహరిస్తూ నిత్యం అబద్దాలు వల్లిస్తూ, హింసలకు పాల్పడుతూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. పరిపాలన చేతకాని, నికృష్టమైన, మానసిక స్థితులేని జగన్ రెడ్డి ప్రభుత్వానికి గోరి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 2024లో జరిగే ఎన్నికల్లో వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా రాదని  తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారు రామదాసు, జనసేన పార్టీ అరకు నియోజకవర్గ నాయకుడు. కొన్నేడి లక్ష్మణరావు, దుర్య సాయిబాబా, శ్రావణ్, పవన్, కోటేశ్వర్, పడాల్, ధనేశ్వరరావు, చిన్నారావు, చందు, చిరంజీవి, సురేష్, అరకు నియోజకవర్గం 6 మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com