సుండుపల్లి, (జనస్వరం) : సుండుపల్లి పట్టణంలో సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు అంతా రోడ్లపై పారుతూ అపారిశుద్ధ్యం నెలకొందని వెంటనే మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం ద్వారా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సుండుపల్లి పట్టణంలో మురుగు కాలువలు నిర్మించాలని కోరుతూ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి సురేష్ బాబుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ సుండుపల్లి పట్టణంతో పాటు అగ్రహారం, ఎట్టిగడ్డరాచపల్లి, పెద్దబలిజపల్లి, గుట్టకడాబలిజపల్లి, సామిసెనిగడ్డ హరిజన, దళిత వాడలు మరియు మళ్ళక్కగారిపల్లి,తదితర ప్రాంతాల్లో మురుగు కాలువలు లేకపోవడంతో నీరు అంతా రోడ్లపై పారుతూ దోమలకు నిలయాలుగా మారుతుందని దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పై సమస్యలను యుద్ధ ప్రాతిపదికన మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు.అదేవిధంగా రోడ్ల విస్తరణ పనులు కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, గ్రామస్థులు, జనసైనికులు, రాజేష్, శ్రీను రాయల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.