అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం నగరంలోని స్థానిక ఆదిముర్థి నగర్ లో గల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత గారు సందర్శించి అక్కడి పరిస్థితులను వసతి గృహవిద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతి గృహంలో సరైన మౌలిక సదుపాయాలు లేవని అంతేకాకుండా విద్యార్థులకు ప్రతినెలా ఇవ్వవలసిన కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వడం లేదని ఇలా అయితే పేద విద్యార్తులపై ఆర్థిక భారం పడి విద్యను మధ్యలోనే వదిలిపెట్టడానికి ఆస్కారం ఉందని అందువల్ల ప్రభుత్వం ప్రతినెల కాస్మోటిక్స్ చార్జీలు చెల్లించాలని వీటితోపాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి నెలకు రెండుసార్లు హెల్త్ క్యాంపులు వైద్య నిపుణులతో నిర్వహించ వలసి ఉంటుందని కానీ ప్రస్తుతం హెల్త్ క్యాంపులు జరగడం లేదని ఇక్కడ ఒక చిన్న హాలులోనే 40 మందిదాకా విద్యార్థులను ఉంచుతున్నరని ఇలా ఉంచడం వల్ల విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతినే ఆస్కారం ఉందని ప్రభుత్వం ఈ శీతాకాలంలో అయినా హెల్త్ క్యాంపులు విధిగా నిర్వహించి విద్యార్థులు సీజనల్ వ్యాధులకు గురికాకుండా చూసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వీటితోపాటు ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు ప్రస్తుతం 14వందల రూపాయలు ఇస్తుండగా కనీసం 2వేళ రూపాయలకన్నా పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని బాలికల వసతి గృహ పరిసర ప్రాంతాలలో ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు మహిళా పోలీసులతో ప్రత్యేక దృష్టి పెట్టించి వసతిగృహ ఆవరణలో సీ.సీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com