రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

     బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 25 మంది దివ్యాంగుల మహిళపైన లైంగిక దాడులు అత్యాచారాలు జరిగినాయి. ఈ నెల 8 వ తారీఖున కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లాలోనే దివ్యాంగుల మహిళలపైన దాడులు అత్యాచారాలు జరిగిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం 2018 2019 బడ్జెట్ లో 120 కోట్లు కేటాయించినారు. జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు బడ్జెట్ లో దివ్యాంగులకు మొండిచెయ్యి చూపించారు. 2022-2023 బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి  37 కోట్ల 20 లక్షల బడ్జెట్ పెట్టి గత ప్రభుత్వం బడ్జెట్ కన్నా తగ్గించి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అందర్నీ అవమానపరిచారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పెద్ద వారందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఏ రకంగా అవమానము చేస్తోందో చూడండి అన్నారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way