అనంతపురం, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇచ్చామని తమ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది. అనంతపురం జిల్లా పూలకుంట, మనీలా గ్రామాలకు పోయి క్షేత్రస్థాయిలో 4 కుటుంబాల్ని విచారించగా ఈ నెల 12న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన రైతు భరోసా యాత్ర పర్యటనకు వచ్చిన రోజు రెండు కుటుంబాలకు మాత్రమే హడావుడిగా ఏడు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు. మన్నీల గ్రామానికి చెందిన ఆదినారాయణ కుటుంబానికి, కేశవాచారి కుటుంబానికి కేవలం రైతు బీమా సొమ్మును పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చిన రోజు హడావుడిగా లక్ష రూపాయలు మాత్రమే వారి అకౌంట్లోకి జమ చేశారు. మిగిలిన 6 లక్షల రూపాయలు నేటి వరకు ఇవ్వలేదు. జనసేన రైతు భరోసా యాత్ర ఈ నెల 12న పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాకు విచ్చేసి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు జీవితం మీద భరోసా కల్పించి, ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు తన వంతు సాయంగా అందించారు. దేశంలో ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేని గొప్ప కార్యక్రమముకు శ్రీకారం చుట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగానే కాక, దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఇది చూచి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ, ప్రజల దృష్టి మళ్లించే విధంగా వారి సంబంధించిన సాక్షి మీడియా ద్వారా మరియు సోషల్ మీడియ PayTM సభ్యుల ద్వారా తప్పుడు కథనాలు, కట్ అండ్ పేస్ట్ ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి తక్షణమే ఏడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com