నెల్లూరు ( జనస్వరం ) : రూరల్ సెంటర్ లేఅవుట్ ఎదురుగా ఉన్న బాలాజీ గోల్డెన్ లేఔట్ నందు ఎల్లమ్మ కొత్తగా పెట్టడానికి ప్రయత్నిస్తూ స్థానిక మహిళలు గృహంలో నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాల్లో సరుకు పెట్టకుండా జనసేన, తెలుగుదేశం మరియు సిపిఎం నాయకులు స్థానికులు మహిళలు అందరూ అడ్డుకుంటూ వస్తున్నారు. జనసేన పార్టీ తరఫున లీగల్ ఇన్చార్జ్ చదలవాడ రాజేష్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నివాస స్థలాల వద్ద కాపురస్తులను సందర్శించి వారి ఇబ్బందులను తెలుసుకొని లీగల్ సెల్ తరఫున అండగా ఉంటామని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం దుకాణం ఇక్కడ పెట్టనివ్వకుండా అడ్డకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను అన్న జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాలు తగ్గించపోగా సేల్స్ పెంచుకొని వాటి ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ప్లాను లో పార్కులు,స్విమ్మింగ్ పూల్ తో పాటు మద్యం దుకాణంలో కూడా కొత్తగా అనుమతులు ఏర్పాటు చేసి రికార్డుకు ఎక్కుతుంది వైసిపి ప్రభుత్వం. 100 మీటర్ల దూరంలో మరో మద్యం దుకాణం ఉండంగా నివాస స్థలాల మధ్య కొత్తగా ఈ మద్య దుకాణం ఏర్పాటు చేయడానికి స్థానికులు ఎవరు ఒప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత లైట్లు సరిగా లేనందువలన కార్పొరేషన్ లిమిట్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతమంతా అంధకారంలో ఉండి మహిళలు చిన్నపిల్లలు బయటికి రావాలంటేనే భయంగా ఉంది, ఆకతాయిలు తాగి ఇక్కడ తిరుగుతూ ఇబ్బందులుగా ఉన్నాయి. సమస్యలను మరింత ఉధృతం చేస్తూ నివాస స్థలాల మధ్య ముందు పక్క కొట్టుకి ఎక్స్టెన్షన్ గా మినీ బారిన ఏర్పాటు చేస్తున్నారు. ముందు పక్క మందు కొనుక్కున్నవారు వెనక పక్క ఇళ్లకు ముందుగా రూముల్లో కూర్చుని తాగి ఏదైనా చేయొచ్చు అనేది ప్రభుత్వం అనుమతులుగా భావిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇక్కడికి వచ్చి దుకాణం పెట్టకుండా ఎలా అవుతారో మీ సంగతి చూస్తామని బెదిరించడం ఖండించాల్సిన విషయం. ప్రజా వ్యతిరేకత ఉంటే ఆయా స్థలాల్లో మద్యం దుకాణాల్లో పెట్టకూడదని కోర్టు చెప్తోంది. ఈ సమస్య పై న్యాయపోరాటం గా కూడా చేస్తాం.కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి,ఎక్సైజ్ కమిషనర్ గారికి అందరికీ అర్జీలు పంపటం జరిగింది. స్పందన లో కలెక్టర్ గారిని కలిసి చర్యలు తీసుకొని న్యాయం జరుగకపోతే న్యాయ పోరాటానికి జనసేన పార్టీ తరఫున స్థానికులతో సిద్ధమవుతామని తెలిపారు. మద్యం దుకాణానికి ఏర్పాటు చేసిన గ్రిల్స్ తీయించే వరకూ కూడా జనసేన మీకు తోడు ఉంటుందని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా ఇన్చార్జి చదలవాడ రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల, జిల్లా ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుదీర్, కార్యదర్శి ప్రశాంత గౌడ్, హేమచంద్ర యాదవ్,కేశవ్, ఖలీల్రేణుక తదితరులు పాల్గొన్నారు.