
విజయనగరం ( జనస్వరం ) : యాక్సిడెంట్లకు అడ్డగా మారిన దాసన్నపేట ఎర్ర చెరువు జంక్షన్, విజయనగరం నియోజవర్గంలో కల దాసిన పేట ఎర్ర చెరువు జంక్షన్ వద్ద తరచూ వాహనాలు యాక్సిడెంట్లకు గురై ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని,తక్షణమే ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్స్,డేంజర్ జోన్ బోర్డును,సైన్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారిని కోరారు. ఈ విషయమై మంగళవారం ఉదయం జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ ,చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ కు సమస్యను వివరించి వెంటనే పరిష్కార దిశగా డేంజర్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జనసైనికులు సురేష్, రాజు పాల్గొన్నారు