ఎమ్మిగనూరు ( జనస్వరం ) : మెగా ఫ్యాన్స్ సేవా సమితి తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు ఆల్పహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్, లు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సేవగుణం కలిగి ఉండాలి ప్రతిఒక్కరూ తమ్మకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తమకు స్ఫూర్తి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య, రమేష్, శివ, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com