Logo
Date of Publish : 29 December 2022, 10:46 am
Editor : Sake Naresh

చేసిన సేవలే గుర్తింపును ఇస్తాయి : జనసేన నాయకులు గురాన అయ్యలు

• గురాన అయ్యలును సత్కరించిన అంజనీపుత్ర చిరంజీవి యువత

• అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు అభినందనలు తెలిపిన జనసేన నాయకులు గురాన, ఆదాడ

       విజయనగరం, (జనస్వరం) : ప్రముఖ వ్యాపారవేత్త, జనసేనపార్టీ యువనేత గురాన అయ్యిలు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు కోయ్యాన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో మెగా ఫ్యామిలీ అభిమానులు, స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్దనున్న జి.ఎస్.అర్. హోటల్ లో గురువారం ఉదయం గురాన అయ్యలు ను మర్యాదపూర్వకంగా కలిసి, అయ్యలు ను సత్కరించారు. అలాగే డిసెంబర్ 23, 24తేదీల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ 2022 ముగింపు ఉత్సవాల్లో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు ప్రత్యేకమైన సేవా అవార్డులు రావటంతో జనసేన నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహనరావు, క్లబ్ అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షుడు లోపింటి కళ్యాణ్ కు, సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేత అయ్యలు మాట్లాడుతూ అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సేవలు అభిందనందనీయమని, తక్కువ కాలంలో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుందని, చేసిన సేవలే గుర్తింపును ఇస్తాయని, నడుస్తూ, నడిపిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యము అనే నినాదంతో వాకర్స్ క్లబ్బులు అన్నీ సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కి కుమార్, రెయ్యి రాజు, గుల్లపాటి మోహన్ కుమార్, రాజేష్, పత్రి సాయి, ఎంటి రాజేష్, కందివలస సురేష్, ఆనంద్, సాయి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com