Logo
Date of Publish : 11 March 2026, 10:13 pm
Editor : Sake Naresh

వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో టీసీ వరుణ్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు

గుత్తి, మార్చి 4, (జనస్వరం) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ జన్మదినం సందర్భంగా గుత్తి పట్టణంలో జనసేన శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం చెరువుకట్ట వద్ద ఉన్న శిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి టీసీ వరుణ్ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు దూరంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జనసేన శ్రేణుల ప్రత్యేకత అని అన్నారు. భవిష్యత్తులో టీసీ వరుణ్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు వెంకటపతి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శులు గోరంట్ల నాగయ్య, మిద్దె ఓబులేష్, చంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com