విశాఖపట్నం ( జనస్వరం ) : ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో స్పందించి ఇతరులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 103వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 33 వ వార్డు అమ్మవారి వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి లాస్యకు పట్టుబట్టలు, వెండి పట్టిలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇతరులకు సేవ చేయాలని సంకల్పంతో తను ముందుకు వచ్చానని చెప్పారు. నిరుపేదలకు సహాయం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో తన సేవలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రశాంతి , జయలక్ష్మి, జానకి, రాజు, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com