విజయనగరం ( జనస్వరం ) : ప్రముఖ ఎం.ఎస్.ఎన్. విద్యా సంస్థల అధినేత,ప్రముఖ సంఘసేవకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ నాయకులు ఎం.సత్యనారాయణ(ఎం.ఎస్.ఎన్) జనసేన పార్టీలో శుక్రవారం ఉదయం, తాటిపూడి దగ్గరలో ఉన్న గ్రీన్ బ్రీజ్ రిసార్ట్స్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు ఎం.ఎస్.ఎన్ మాట్లాడుతూ యువత భవిష్యత్ కోసం నూతనరాజకీయాలకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని, గతంలో ప్రజారాజ్యం పార్టీలోనూ, వైసిపిలో పనిచేశానని, నాదెండ్ల మనోహర్ మీ అనుభవంతో జనసేన బలోపేతంనకు కృషి చేయాలని అనడం నాకు ఎంతో తృప్తి చెందానని, ఇదేనూతన ఉత్తేజంతో జనసేనపార్టీ 2024లో గెలుపు దిశగా అహిర్నిశలు పని చేస్తానని అన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, ఎం.సత్య నారాయణ, త్యాడ రామకృష్ణారావు(బాలు) పార్టీ పెద్దలు నాదెండ్ల మనోహర్ ను సత్కరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com