ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని ప్రగతి కాలనీలో ఒంగోలు నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సహకారంతో సెమీ క్రిస్మస్ వేడుక సందర్బంగా ప్రార్థన నిర్వహించి అనంతరం అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయి బాబా మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్ధాంతాల్లోని కులాలని కలిపే ఆలోచన విధానంలో భాగంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకను జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని మీ అందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కీ, జనసేన పార్టీకీ రాబోయే రోజుల్లో ఉండాలి అని అన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ఖలీఫాతుల్లా బాషా సోదరులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అని ఆ ప్రభువు ఆశీస్సులు మన అందరికీ ఉండాలి అని, అలానే మీరు అందరు మంచి మనస్సుతో రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాడుతూ బలహీన వర్గాలకు అండగా ఉంటున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థించాలని అని అన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల మాట్లాడుతూ ఆ ప్రభువు చూపిన మార్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జిల్లా లో షేక్ రియాజ్ సారధ్యంలో ముందుకు వెళ్తామని మీ అందరి చల్లని ఆశీస్సులు జనసేన పార్టీ మీద ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ కుమార్, పల్ల ప్రమీల, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు బొందిల మధు, ఒంగోలు నగర జనసేనపార్టీ కార్యదర్శులు చంగళశెట్టి సుధాకర్, శబరి తోట, జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శులు శ్రీమన్నారాయణ, ఆకుపాటి ఉష, సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష, 28 వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, జనసేన నాయకులు భూపతి రమేష్, చైతూ, చెన్ను నరేష్, అవినాష్, వీరమహిళ సుంకర కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com