Logo
Date of Publish : 24 December 2021, 3:40 pm
Editor : Sake Naresh

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

    మంగళగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ గారు అధ్యక్షత వహించారు. మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సెమి క్రిస్మస్ అనగా ఏసుప్రభు పుట్టిన పర్వదినంగా, రాష్ట్ర ప్రజలకు యేసు ప్రభు సుఖశాంతులు, సుభిక్షం ఆశీర్వదించాలని, అధికారులు ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగం చేయకుండా ఉండాలని వారికి కూడా ప్రజల పట్ల మంచి భావనతో నడవాలని ఆ ప్రభువు కలగజేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు, జనసేన సైనికులకు మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నూతన వెలుగును నింపి వారు చేపట్టిన ప్రతి పని విజయంగా ముందుకు నడవాలని, మేము కోరుకుంటున్నాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే రాష్ట్రంలో సంభవించాలని, కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అది జరగాలని మేము అందరూ ఆశిస్తూన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో మనస్సు మార్చుకొని నీతి నిజాయితీతో ప్రజలను పరిపాలించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా నాయకుడు ఏదైతే మార్పు రావాలని కోరుకుంటున్నాడో మా పార్టీ ఆవిర్భావం నుండి ఈరోజు వరకు మార్పు తీసుకురావడం జరిగింది. పార్టీ కులాల మతాలకు అతీతంగా మేము అందరూ ఒకటేనని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి సయ్యద్ కమల్ మాట్లాడుతూ ఏసుప్రభు దైవజనులు తనను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత చిత్రం హింస చేసిన ఎప్పుడు కోపంగాని వారిపట్ల ఎప్పుడు ప్రేమ హృదయం చూపించే గొప్ప వ్యక్తి ఏసుప్రభు అని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ ముఖ్య ఉద్దేశాన్ని జనసేన పార్టీ కార్యదర్శి బేతపూడి విజయ్ గారు మాట్లాడుతూ ఈ డిజైనర్ బ్యానర్ చేసిన వ్యక్తి ఒక మాట అన్నాడు. ఈ బ్యానర్ లో ఉన్న వ్యక్తి ఏసుప్రభువా పవన్ కళ్యాణ్ గార అన్నారు. ఆ మాట వినగానే నాకు మాత్రం ఒక్కసారిగా రోమాలు పోడుచుకొన్న ఈ దారితప్పిన గొర్రె పిల్లను వేటగాడు నుండి కాపాడినట్లు ప్రభువు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలను కూడా ఒక దిశ నిర్దేశితో పవన్ కళ్యాణ్ గారు దారిలో నడపాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు నా దగ్గర ధనం లేదు, అధికార బలం లేదు, కానీ గుండె ధైర్యం ఉంది. ఆ గుండె ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తాను అనే ఒక స్ఫూర్తితో నేను కూడా నడవటం జరుగుతుంది. ఆ ప్రభువు దీవెనలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన నాయకులకు జనసేన పార్టీ శ్రేణులకు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ సత్య ప్రకాష్ గారు జనసేన నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ చేనేత వికాస విభాగం నుంచి చైర్మన్ శ్రీ చల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ కమాల్, జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ గౌతమ్ రాజ్ పాకనాటి, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, గుంటూరు జిల్లా కార్యవర్గం మరియు కృష్ణా జిల్లా కార్యవర్గం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com