Logo
Date of Publish : 13 April 2024, 3:54 pm
Editor : Sake Naresh

నిస్వార్థ ప్రజా సేవకులు వైసీపీలో ఉండలేరు : కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి

     తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 13 (జనస్వరం) : నిస్వార్ధంగా ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా జగన్ కుట్రల పార్టీలో ఉండలేరని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద తాడేపల్లిగూడెం వైయస్సార్ పార్టీ 6 వార్డ్ ఇంచార్జ్ ముద్దుల నాగ వెంకటప్రసాద్ ను బొలిశెట్టి పార్టీ కండువా వేసి జనసేన లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేసిన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోలేదని తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదని పవన్ కళ్యాణ్ నిస్వార్ధ ప్రజాసేవకు, ఆయన విధానాలకు ఆకర్షితులై జనసేనలోకి రావడం అభినందించాల్సిన విషయం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్, అతని వెంట నడిచే నాయకులు అంతా కుటిల రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు కుదేలైపోయాయని ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని పేర్కొన్నారు. కానీ తాను ఇచ్చేవి మాత్రం చెప్పుకుంటూ దోచేవి లాక్కునేవి చెప్పడం లేదన్నారు. ప్రజలు వాటిని గుర్తించి వైసీపీని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 6 వార్డ్ ఇంచార్జ్ మద్దుల నాగ వెంకట ప్రసాద్ తోపాటు  గొర్ల దుర్గారావు, వేగిరాజు రామచంద్ర రాజు, ఆది కొండలరావు, నారిన ఏడుకొండలు, సోమశేఖర వర్మ తదితరులు పార్టీలో చేరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com