విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాము గ్రామములో అర్హులు అయిన వారి పింఛన్లును తొలగించిన సర్కారు పై హైకోర్టు లాయర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని గారు MRO గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామములోను అర్హులైన పింఛన్లను అన్యాయంగా తొలగించడం దారుణమన్నారు. అలాగే శివరం అనే గ్రామ పంచాయతీలో జనసేన సైనికులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి పాలవలస యశస్విని గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమములో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, తవిటి నాయుడు, రేగిడి లక్ష్మణ్ రావు, ఉపేంద్ర, రాంబాబు, ఏసు, చిన్నం నాయుడు, వినోద్ కుమార్, గణేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.