ఏపీలో పాఠశాలలు తెరిచి చిన్నపిల్లల్ని కరోనా బారిన పడేస్తున్నారు : అంకిపల్లి అఖిల్
ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి భయంతో భయపడుతూ మరోసారి లాక్ డౌన్ విధించే నేపథ్యంలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో పాఠశాలను తెరిచి పసిపిల్లలు బడికి రావాలి అని చెప్పి బడికి వచ్చే పిల్లల తల్లిదండ్రుల దగ్గర మీరు కరోనా బారిన పెడితే మాకు ఎటువంటి సంబంధం లేదని ఒక పత్రం పైన సంతకం పెట్టించుకొని వారిని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా కొద్ది రోజులు పాఠశాలను మూసివేసి పిల్లలను సురక్షితంగా చూసుకోవాలి అని చెప్పాల్సిన ప్రభుత్వమే, ఇప్పుడు బడులు తెరచి పిల్లలు ఇబ్బంది పెట్టడం మంచిది కాదని రైల్వే కోడూరు జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు తెరచిన మొదటిరోజే చిత్తూరు జిల్లాలో చాలామంది విద్యార్థులు కరోనా బారిన పడటం జరిగింది. అదేవిధంగా నిన్నటికి నిన్న కడప జిల్లా పాఠశాలలో పరీక్షలు నిర్వహించగా అక్కడ విద్యార్థులు కరోనా బారిన పడినట్టు తెలిసింది రాష్ట్రంలో అనేక చోట పాఠశాలల్లో పిల్లలకి కరోనా బారిన పడుతున్నారని అలా పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇంకా కొద్ది రోజులు కరోనా మహమ్మారి కి మందు వచ్చేవరకూ పాఠశాలను మూసివేసి పిల్లల్ని సురక్షితంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని అధికారులను విన్నవించుకుంటున్నాము అని రైల్వే కోడూరు జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్ తెలియజేశారు.