బనగానపల్లె, (జనస్వరం) : బనగానపల్లె పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను కలిసి కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని జనసేన పార్టీ నాయకులు భాస్కర్ గారు వారికి తెలియజేయడం జరిగింది. సోమవారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పర్యటించి అక్కడ ఉన్న యాజమాన్యాలతో మాట్లాడుతూ స్కూల్స్ లలో పనిచేసే ప్రతి ఒక ఉపాధ్యాయుడు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలని అలాగే పాఠశాలలో శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్ ముఖద్వారం దగ్గర ప్రతి విద్యార్థికి మాస్క్ లు తప్పనిసరి చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పట్టణంలోని నెహ్రూ స్కూల్, శ్రీ చైతన్యస్కూల్, ఆక్సిలియం పాఠశాలల యాజమాన్యాలకు బనగానపల్లె జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు స్పందిస్తూ తాము పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు అజిత్, అల్లాబకాస్, విక్రమ్, జనార్ధన్, మధు, ప్రశాంత్, రాము, మహేష్, వెంకటేష్, సింహాద్రి, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com