Logo
Date of Publish : 22 November 2025, 7:44 pm
Editor : Sake Naresh

ఫలితాల మెరుగుకోసమే స్కూల్ కాంప్లెక్స్ – క్లస్టర్ కార్యదర్శి గొర్తి వెంకట్ వెల్లడి

అనంతపురము, నవంబర్ 22, జనస్వరం : ప్రతి పాఠశాల సముదాయం అభ్యాసం, మార్గదర్శకత్వం, ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుందని పాపంపేట క్లస్టర్ కార్యదర్శి, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి అన్నారు. పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం కోసమే క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పాపంపేట క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం శనివారం విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ సమావేశాలలో చర్చించిన ఫలితాలను చురుకుగా పాల్గొనడానికి, సహకరించడానికి, అమలు చేయడానికి ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తారని తెలిపారు. భవిష్యత్ శిక్షణ నిర్ణయాలలో అభిప్రాయాన్ని, అమలు నివేదికలను సకాలంలో సమర్పించడం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించడానికి పాఠశాల విద్యా శాఖ వివరణాత్మక మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రణాళికలను అందజేసిందన్నారు. సెషన్ వారీగా నిర్మాణాత్మక ఎజెండా, థీమ్‌లు, తరగతి గది బోధన, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి నెలవారీ థీమ్‌లు వుంటాయన్నారు. పాఠ్య ప్రణాళికలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్ఎం), పాఠశాల పనితీరు సమీక్ష చేశామన్నారు. పరిష్కార బోధనా వ్యూహాలు, విద్యార్థుల పురోగతి ట్రాకింగ్‌పై ప్రణాళిక, సహకారం అందుతుందన్నారు. ‘టీచర్ హ్యాండ్ బుక్’ ఎలా ఉపయోగించాలో ఉపాధ్యాయులకు సెపరేట్ ప్రెజెంటేషన్ చేశామన్నారు. ప్రైమరీ ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ విద్యా ప్రదర్శన, అసెస్ మెంట్ బుక్ లెట్, లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించామన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com