బాపట్ల ( జనస్వరం ) : జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న మూడుసార్లు డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నాలుగో సంవత్సరం అయినా దివ్యాంగుల సమస్యల మీద పరిష్కరించాలని కోరుతూ
1. అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెళ్లి చేసుకున్న దివ్యాంగులందరికీ చదువుతో సంబంధం లేకుండా పెళ్లి కానుక ఇవ్వాలి.
2. దివ్యాంగులందరకూ 300 యూనిట్లు ఉచిత కరెంటు కల్పించాలి
3. దివ్యాంగుల2016 హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
4. కొత్త జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
5. దివ్యాంగులకి మోటార్ వాహనాలకు చదువుతో సంబంధం లేకుండా ఇవ్వాలి
6. దివ్యాంగులు బడ్జెట్ వెయ్యి కోట్లు విడుదల చేయాలి
పైన ఉన్న దివ్యాంగుల సమస్యలన్నీ కూడా డిసెంబర్ 3 దివ్యాంగుల దినోత్సవం రోజు పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కగ్గా రామారావు, తాటిశెట్టి శ్రీనివాసరావు, ఫణీంద్ర చంద్రశేఖర్, తాడిచెట్టి గోపికృష్ణ, రెడ్డి సుధాకర్, గండికోట బ్రహ్మయ్య, నండూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com