Logo
Date of Publish : 20 January 2023, 5:10 pm
Editor : Sake Naresh

ఎస్.సి, ఎస్.టి శాశ్వత చట్టం ఏర్పాటు చేయాలి, సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి పెంచాలి : జనసేన నాయకులు ఆదాడ మోహనరావు

    విజయనగరం ( జనస్వరం ) : ఎస్.సి, ఎస్.టి. శాశ్వత చట్టం ఏర్పాటు చేయాలని,ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితిని పెంచాలని, జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు ఆదాడ మోహనరావు శుక్రవారం ఉదయం డి.అర్.ఓ. గణపతిరావు కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజనుల సమాగ్రాభివృద్దే లక్ష్యంగా 2012 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రోజులపాటు ప్రత్యేకంగా చర్చించి ఏకగ్రీవంగా రూపొందించిన ఎస్సి, ఎస్టీ, సబ్ ప్లాన్ ప్రణాళిక కేటాయింపు మరియు ఆర్ధిక వనరుల వినియోగం చట్టం 2013 పేరున పది సంత్సరాలపాటు నాటి రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో రూపొందించారు. దళితులకు, గిరిజనులకు ప్రత్యేక స్మశాన వాటిక స్థలం కేటాయించాలని, ఎస్సీ,  ఎస్టీ, సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ఈ నెల 23 వ తేదీన ముగియడంతో కాల పరిమితి పెంచాలని వినతి పత్రం అందజేశారు. సబ్ ప్లాన్ చట్టానికి బలపరచాల్సిన అంశాలను కూడా వినతిపత్రం జతచేసామని, దళితుల, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ నాయకులు ఆర్. ఈశ్వరరావు, వై.భాస్కరరావు, కె.వరలక్ష్మి, టి. కళ, అర్.నాగమణి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com