Logo
Date of Publish : 04 January 2022, 10:06 am
Editor : Sake Naresh

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం “సావిత్రిబాయి పూలే” :

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం "సావిత్రిబాయి పూలే"
- జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్
       విజయవాడ, (జనస్వరం) : సావిత్రిబాయి ఫూలే 191వ జయంతి వేడుకలను నగర్ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం అని భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి, 1848 మే 12న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారని, మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే అని, మహిళలు చదువుకోవాలని పరితపించే మహిళని, బాల్య వివాహాలను అడ్డుకున్న మహిళాని, కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారని 1848 లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమెనని, దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి గన్ని రాము, జనసేన నాయకులు శివ, గరికపాటి ఆంజనేయులు, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com