Logo
Date of Publish : 15 November 2022, 3:54 pm
Editor : Sake Naresh

వైసీపీ భూ భకాసురుల నుంచి రాష్ట్రాన్ని కాపాడండి : పేద ప్రజలు

         బొబ్బిలి (జనస్వరం ) : రామభద్రపురం మండల కేంద్రంలో వైసిపి నాయకులు ప్రభుత్వం భూమిని కబ్జా చేస్తున్నా.. స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్వే నెంబర్ 98/1లో గల 56 సెట్లు 1966 లో ముడడ్ల పద్మనాభం ప్రభుత్వానికి దానంగా ఇచ్చారని, గతంలో ఆ స్థలంలో వెలుగు కార్యాలయం ఉండేదని, ఇటీవల ప్రైవేట్ వ్యక్తులు జేసీబీతో కూల్చివేసి ఆక్రమించారని తెలిపారు. గత 50 సంవత్సరాల నుంచి అక్కడ కొంతమంది నివాసం వుంటున్నారు. పేదవాళ్ళని అక్కడ స్థానిక ఆక్రమార్కులు బెదిరింపులు చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామభద్రపురం ఎం.ఆర్.ఓకి, బొబ్బిలి డివిజినల్ రెవున్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు సంచాన గంగాధర్, రామభద్రపురం మండల నాయకుడు మహంతి ధనుంజయ, మండలం జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కార్యనిర్వాన కమిటీ సభ్యులు, గారా గౌరీ శంకర్, అల్లు రమేష్, మోతీదాస్, మారడాన రవి, మామిడి దుర్గ ప్రసాద్, జన సైనికులు పోతుల శివశంకర్, చీమల సతీష్,శ్యామ్ పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com