Search
Close this search box.
Search
Close this search box.

నరవ గ్రామంలో క్వారీ గోతులు నుండి ప్రజల ప్రాణాలను కాపాడండి : జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

వబ్బిన శ్రీకాంత్

             పెందుర్తి ( జనస్వరం ) : 88 వార్డ్, నరవ గ్రామంలో గల క్వారీ గోతులు ప్రమాదకరంగా తయారయ్యి ఎటువంటి హెచ్చరిక బోర్డు లేకపోవడం వలన ప్రజలు మరణిస్తున్నారని కావున వెంటనే ప్రజలకు ప్రమాదకరమైన ప్రదేశం అనే హెచ్చరించేలాగా బోర్డులు ఏర్పాటు చేయాలని పెందుర్తి మండల తహసిల్దార్ ఆనంద్ ను కలిసి జనసేన పార్టీ స్థానిక నాయకులు శ్రీకాంత్ గారు వినత పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యను వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలు క్రితం ఇష్టానుసారంగా నరవ కొండ ప్రాంతంలో క్వారీ తవ్వడం వలన లోతైన గోతులు ఏర్పడి, గోతుల్లో నీరు చేరి ఇప్పుడు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఏర్పడ్డాయని, నాలుగు రోజుల క్రితం యువకుడు ఈతకని దిగి మరణించడం జరిగిందన్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి మరణించడం జరిగిందని కావున దయచేసి ప్రజలకు తెలిసేలాగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీలు జరపడం వలన ఆ ప్రదేశం భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధికి ఉపయోగపరం కాకుండా ఉంటాయి దీనివల్ల ప్రభుత్వానికి ఆస్తి నష్టం మరియు గ్రామ అభివృద్ధికి ఆ ప్రదేశం నిరుపయోగంగా మారుతుందని కావున వెంటనే ఇటువంటి క్వారీలు జరుపుకుండా ఉండడం కోసం వీలైనంతవరకు కంచి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. మండల ప్రభుత్వ అధికారులు ఆ ప్రదేశానికి వచ్చి రెగ్యులర్గా మోనిటరింగ్ చేసినట్లయితే అక్రమదారుల ఆగడాలు అరికట్ట వేయవచ్చు తప్పకుండా మీరు నరవ గ్రామం పై ప్రత్యేకమైన దృష్టి వహించమని కోరడం జరిగింది, తాసిల్దార్ వివరణ ఇస్తూ రోజు రోజుకి మీయొక్క గ్రామంలో అక్రమ దారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. మీ యొక్క గ్రామ సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి పెడతానని, అక్రమాలు జరిపిన వ్యక్తులు మీ గ్రామస్తులవడం వలన మేము పట్టుకోవడానికి కొంత టైం పడుతుందని, మీ గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందిస్తే అక్రమ దారులను త్వరగా పట్టుకొని శిక్షించవచ్చని, ఒక పూట త్వరలోనే మీ గ్రామాన్ని సందర్శిస్తారని బదులు ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way