
ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో 25, 26 వ వార్డ్ సుందరయ్య నగర్ లో నిర్వహిస్తూ భవన కార్మికుల మరియు మైనారిటీ సోదరుల కష్టాలు తెలుసుకున్నారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తామని అలాగే ధర్మవరంలో జరుగుతున్న దోపిడీలు దౌర్జన్యాల గురించి తెలుసుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ధర్మవరంలో ఎలాంటి దౌర్జన్యాలు రౌడీయిజాలు లేకుండా కాపాడుకునే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.