
ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, YSR కాలనీ, తదితర కాలనీలో నిర్వహించారు. జనసేన-తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేనేతలను, చిరు వ్యాపారులను, మైనారిటీ సోదరులను ఆదుకుని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కాలనీ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు. తప్పకుండా జనసేన టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే వారి యొక్క సమస్యలన్నీ తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు. ధర్మవరంలో రౌడీ రాజ్యాన్ని పోగొట్టి ఈ వైసీపీ పాలనను అంతమోందించేందుకు ధర్మవరం ప్రజలంతా సహకరించి రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీనీ గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుగుణ, ఆంజనేయులు, రామచంద్ర, శ్రీరాములు, మరియు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.