ధర్మవరం ( జనస్వరం ) : అధికారంలోకి వస్తాం,ప్రజల ఇబ్బందులను గుర్తించి తీరుస్తాం అంటూ సేవ్ ధర్మవరం కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. సేవ్ ధర్మవరం కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 22వ రోజు పట్టణములోని 36 వ వార్డ్ కొత్తపేట లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటి ఇంటికి వెళ్లి సుడిగాలి పర్యటన'గావించారు. ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. తమ ఊరి వాడి నని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ ఇంటి బిడ్డ అనుకుని ఆశీర్వదించాలని ప్రజలను వారు కోరారు. ఎవరికీ ఏ ఇబ్బంది' కలిగినా తన తలుపు తట్టాలన్నారు. తను చేతనయినంత సహాయ సహకారాలు అందిస్తానని ప్రజలకు వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడ్డగిరి శ్యాంకుమార్,బెస్త శ్రీనివాసులు,నాయుడు నాయక్, పేరూరు శ్రీనివాసులు,కోటికి రామాంజి,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com