Logo
Date of Publish : 06 July 2022, 4:57 pm
Editor : Sake Naresh

నిమ్మళపాడు మైనింగ్ నుండి అరుకును కాపాడండి : జనసేన నాయకులు

       అరకు ( జనస్వరం ) : నిమ్మళపాడు మైనింగ్ నుండి అరకును కాపాడాలని అనంతగిరి జనసేన బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ పచ్చని ప్రాంతమైన నిమ్మలపాడులో మైనింగ్ మాఫియా పచ్చదనాన్ని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారన్నారు. కనీసం పర్యావరణ అనుమతులు లేవు మరియు పీసా గ్రామ సభ జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం గిరిజనుల మీద లేని ప్రేమ మైనింగ్ విషయాల్లో ఉనదని, అక్రమంగా తీసుకు పోవుచున్నది గిరిజనులకు నడిచే దారిని... అనుమతులు ఇవ్వని మైనింగ్ కి ఏ విధముగా అనుమతి ఇచ్చారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజనులను మాయమాటలతో మభ్యపెట్టి కాల్ సైట్ మైనింగ్ అక్రమంగా తీసుకొని పోతున్నారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వము ఈ మైనింగ్ మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల మీద ఎందుకు లేదు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి మైనింగ్ మాఫియాను ప్రత్యేకంగా పరోక్షంగా సహకరిస్తున్న వైసిపి నాయకులు, గిరిజన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 1996 చట్టపరంగా ఈ మైనింగ్ అక్రమంగా జరుగుచున్నదని, ఏ రోజు గ్రామసభ జరుగలేదని అలాగే అమాయక గిరిజనులను మభ్యపెట్టి దోచుకోవడంలో వైసిపి ప్రభుత్వము ముందుందని అధ్యక్షులు చిట్టం మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు దండుసేన నవీన్ కుమార్, కొర్రా ప్రవీణ్ కుమార్, శ్రీరామ్ రాందాస్, లక్ష్మణ ప్రసాద్, రామకృష్ణ, అనంతగిరి మండల నాయకులు జి.మంగళ కొర్రా రమేష్, వీరమహిళా రత్నప్రియా పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com