తెలంగాణ ( జనస్వరం ) : సత్తుపల్లి పట్నంలోని ముస్లిం మైనార్టీలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి షాదీ ఖానా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ యొక్క షాదీ ఖానాల నిమిత్తం అధికార ప్రభుత్వం నూతనంగా భవనం ఏర్పాటు చేసుకోవడానికి నిధులు కేటాయించడం జరిగింది. అయితే కేటాయింపులు చేసిన నిధులు ఇంతవరకు కూడా పునాదిరాయి కూడా నోచుకోకపోవడం దురదృష్టకరం. ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గారు షాదీ ఖానాను మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అర్థం కావడం లేదని జనసేనపార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి నరేష్ గారు తెలియజేశారు. దీనివలన ముస్లిం సోదరులు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే కేటాయించిన నిధుల ద్వారా కొత్త షాదీ ఖానా కోసం పనులు త్వరగా మొదలుపెట్టాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని జనసేన పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం తరుపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి జనసేన నాయకులు ఆళ్ల నరేష్, సైఫ్ ఖాన్, శరత్, జబీర్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com