Logo
Date of Publish : 22 February 2023, 4:33 pm
Editor : Sake Naresh

కొత్త షాదీ ఖానాను తక్షణమే నిర్మించాలని నిర్మించాలని సత్తుపల్లి జనసేన నాయకుల డిమాండ్

       తెలంగాణ ( జనస్వరం ) : సత్తుపల్లి పట్నంలోని ముస్లిం మైనార్టీలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి షాదీ ఖానా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ యొక్క షాదీ ఖానాల నిమిత్తం అధికార ప్రభుత్వం నూతనంగా భవనం ఏర్పాటు చేసుకోవడానికి నిధులు కేటాయించడం జరిగింది. అయితే కేటాయింపులు చేసిన నిధులు ఇంతవరకు కూడా పునాదిరాయి కూడా నోచుకోకపోవడం దురదృష్టకరం. ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గారు షాదీ ఖానాను మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అర్థం కావడం లేదని జనసేనపార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి నరేష్ గారు తెలియజేశారు. దీనివలన ముస్లిం సోదరులు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే  కేటాయించిన నిధుల ద్వారా కొత్త షాదీ ఖానా కోసం పనులు త్వరగా మొదలుపెట్టాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని జనసేన పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం తరుపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి జనసేన నాయకులు ఆళ్ల నరేష్, సైఫ్ ఖాన్, శరత్, జబీర్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com