Logo
Date of Publish : 17 April 2026, 9:59 pm
Editor : Sake Naresh

CBSE పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయం

చరిత్ర సృష్టించిన సత్తెనపల్లి కేంద్రియ విద్యార్థులు.

CBSE 10వ తరగతిలో 100% ఫలితాలతో విజయ కేతనం

సత్తెనపల్లి,ఏప్రిల్ 17,(జనస్వరం)

సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయ 2025-2026 విద్యా సంవత్సరం 10వ తరగతి బోర్డు పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధిస్తూ 100% ఫలితాన్ని నమోదు చేసి చరిత్రను సృష్టించింది. పాఠశాల అధ్యాపకుల నిరంతర శ్రమకు, విద్యార్థుల కృషికి అంకితభావానికి నిదర్శనం. 2025-2026 విద్యా సంవత్సరం గాను మొత్తం 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 27 మంది విద్యార్థులందరూ విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు,అధ్యాపకుల కృషికి గాను ఆనందం వ్యక్తం చేశారు.ఈ సంవత్సరం అత్యధిక మార్కులు 95.5% నమోదు అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్ గుప్తా తెలియజేశారు. ప్రథమ స్థానం శంకర్, ద్వితీయ స్థానం మణికంటా నాయక్,తృతీయ స్థానం మనీష్ రెడ్డి లు పొందారు. విద్యార్థులు సాధించిన విజయం వ్యక్తిగత విజయమే కాకుండా మొత్తం పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు సాధించారని విద్యార్థులను అభినందించారు.ఈ విజయం లో ఉపాధ్యాయులు బజరంగ్, రమాకాంత్ మిశ్రా,సౌరభ్ రాజోరియా, సౌజన్య, నాగమణి,సత్యం ల పాత్ర ఉంది.ఈ అద్భుత విజయానికి గాను ప్రిన్సిపాల్ జగదీష్ కుమార్ గుప్త అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. విద్య కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా వారు కృషి చేశారు. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయ మరోసారి విద్యా రంగంలో తన ప్రతిభను చాటింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుత విజయాలు కొనసాగాలని ఆకాంక్షిచారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com