Logo
Date of Publish : 30 January 2024, 10:33 pm
Editor : Sake Naresh

చేతకాని మంత్రికి ఓట్లు వేస్తే అభివృద్ధిలో సర్వేపల్లి పదేళ్లు వెనుకబడుతుంది

   సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత రెండుసార్లు ఓట్లు వేయించుకొని గెలిచిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తన సొంత మండలం అయిన పొదలకూరు మండలానే అభివృద్ధి చేయలేక చేతులెత్తేశారు. రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా గుంటలమయంగా మారిపోయి ఉన్నాయి. కాకాని సొంత గ్రామమైన తోడేరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి భువనగిరి పట్నం మరి పవనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేయలేని స్థితిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక క్షణం ఆలోచించండి. రాబోవు ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి రూపురేఖలు మారబోతున్నాయి. మీరందరూ కూడా ఒక క్షణం ఆలోచించి ఆదరించి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామాలను, మన నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా రేపు రాబోవు ప్రజా ప్రభుత్వంలో ప్రభగిరి పట్టణానికి రోడ్డు నిర్మాణం కావచ్చు, అదేవిధంగా గుడి అభివృద్ధి కూడా మా ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా చేయిస్తాం. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మహిళా గుమ్మినేని వాణి, భవాని మండల అధ్యక్షుడు అనిల్ సంజు శ్రీహరి, రహీం జయసుధ తోటపల్లి గూడూరు మండల నాయకులు శ్రీను రవి మనుబోలు మండల నాయకులు కోటిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com