సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత రెండుసార్లు ఓట్లు వేయించుకొని గెలిచిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తన సొంత మండలం అయిన పొదలకూరు మండలానే అభివృద్ధి చేయలేక చేతులెత్తేశారు. రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా గుంటలమయంగా మారిపోయి ఉన్నాయి. కాకాని సొంత గ్రామమైన తోడేరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి భువనగిరి పట్నం మరి పవనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేయలేని స్థితిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక క్షణం ఆలోచించండి. రాబోవు ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి రూపురేఖలు మారబోతున్నాయి. మీరందరూ కూడా ఒక క్షణం ఆలోచించి ఆదరించి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామాలను, మన నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా రేపు రాబోవు ప్రజా ప్రభుత్వంలో ప్రభగిరి పట్టణానికి రోడ్డు నిర్మాణం కావచ్చు, అదేవిధంగా గుడి అభివృద్ధి కూడా మా ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా చేయిస్తాం. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మహిళా గుమ్మినేని వాణి, భవాని మండల అధ్యక్షుడు అనిల్ సంజు శ్రీహరి, రహీం జయసుధ తోటపల్లి గూడూరు మండల నాయకులు శ్రీను రవి మనుబోలు మండల నాయకులు కోటిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com